ఇతర పార్టీల్లాగా మేము తప్పు చేయం, చేయనివ్వం: లక్ష్మీనారాయణ
ఏపీ: రాష్ట్రంలో సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించినట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇతర పార్టీల్లాగా మేము తప్పు చేయం, చేయనివ్వం. బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తాం. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తాం. అవినీతిని అంతమొందిస్తాం. రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకెళ్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం అని పేర్కొన్నారు.