ఏపీలో ప్రతి విద్యార్థికి “తల్లి వందనం” పథకం అమలు చేస్తాం:మంత్రి నిమ్మల
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే తల్లి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా ఈ పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తామన్న తల్లి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.అయితే దీనిపై వైసీపీ గత నెల రోజులుగా దుష్ప్రచారం చేస్తుందని మంత్రి మండిపడ్డారు.కాగా తల్లి వందనం పథకం మార్గదర్శకాలు, కార్యాచరణ రూపొందించలేదన్నారు. కానీ వైసీపీ నేతలు ఈ పథకంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.వాటిని రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని మంత్రి తెలిపారు.సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందిస్తారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.