NationalNewsTelangana

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం

సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఇబ్బందులు తొలగిపోయాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ క్లియర్‌ చేసినందున త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైందని ట్విటర్‌ వేదికగా చెప్పారు. జర్నలిస్టులకు అనుకూల తీర్పు ఇచ్చిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని జర్నలిస్టు స్నేహితులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతామని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన 70 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేసుకునేందుకు, ఇంటి నిర్మాణం చేపట్టేందుకు జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉదయం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.