8 గంటలు చేస్తాం.. 16 గంటలు చేయం..
బెంగళూరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిరసనకు పిలుపునిచ్చారు. IT సాఫ్ వేర్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు 8 గంటల పని విధానం కోసం ఆరోగ్యంతో కూడిన ఉద్యోగాలు కావాలని కోరుతూ KITU ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోజుకు 16 గంటలు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. రోజువారీ పని గంటల పరిమితులను కఠినంగా అమలు చేయాలని, పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం నుండి ఐటీ రంగానికి మినహాయింపును తొలగించాలని, పరిశ్రమలో విస్తృతంగా జరుగుతున్న కార్మిక చట్ట ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కూడా యూనియన్ డిమాండ్ చేసింది. నిరసన ప్రదర్శనలో భాగంగా, నిరసనకారులు నారాయణ మూర్తి మరియు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించారు. అయితే.. బెంగళూరు పోలీసులు వారిని అడ్డుకోవడంతో యూనియన్ సభ్యులు మరియు అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

