ఎంపీ స్థానాలలో మేమే క్లీన్ స్వీప్ చేస్తాం..ఈటల
తెలంగాణలో బీజేపీ ఎంపీ స్థానాలలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమ పార్టీదే అధికారమన్నారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే మెరుగు పడిందని పేర్కొన్నారు. ‘ఈసారి 8 సీట్లు గెలిచి 16 శాతం ఓట్లు సాధించాం. 19 నియోజక వర్గాల్లో రెండవ స్థానం, 46 నియోజక వర్గాలలో డిపాజిట్ సాధించాం. పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ జయభేరి మోగిస్తుంది. 400 సీట్లు గెలుస్తాం’. అని మీడియాతో ధీమా వ్యక్తం చేశారు.

