Home Page SliderNational

ఇక నుంచి ఒంటరిగా పోటీ చేస్తాం..

రాబోయే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో జరిగే ఎలాంటి కార్యక్రమాలైనా ఒంటరిగానే చేస్తామన్నారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమికి ఓటర్లు భారీ మోజార్టీ కట్ట బెట్టారు. అయితే మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా శివసేన (యూబీటీ) వర్గానికి ఘోర ఓటమి దక్కింది. దీంతో సొంత పార్టీలోనే విమర్శలు, ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి, త్వరలో రానున్నబృహణ్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.