home page sliderHome Page SliderNational

వెంటాడి వెంటాడి అంతం చేస్తాం..

పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు గట్టి సమాధానం ఇస్తున్నామని అన్నారు. ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. వెంటాడి వెంటాడి అంతం చేస్తామన్నారు. పహల్గాంలో అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు.