26/11 తరహా దాడులు చేస్తాం… కలకలం రేపుతున్న మెసేజ్‌లు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లు కలకలం రేపుతోంది. సెంట్రల్ ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూం వాట్సాప్ నంబర్‌కు ఉగ్రదాడుల కొన్ని టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చాయి. “26/11 లాంటి దాడి చేస్తాం’’ అని మెసేజ్‌లు పంపాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు… విదేశాల నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్టు నిర్ధారించారు. వరుసగా ఎన్నో మెసేజ్‌లు వచ్చాయని… అందులో 26/11అటాక్‌కు సంబంధించిన మెసేజ్ కూడా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సిటీ క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ జరుపుతోంది. పాకిస్థాన్‌కు చెందిన నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చిందని. ఆరుగురు కలిసి మరోసారి అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు హెచ్చరికలు పంపాడు ఆగంతకుడు. అయితే .. ఏ ప్రాంతంలో దాడులు చేస్తామనేది ఈ మెసేజ్‌లో స్పష్టంగా లేదని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ స్పందిస్తూ… ఈ బెదిరింపు మెసేజ్‌ను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలన్నారు. మెసేజ్‌లను ఎవరు పంపించారనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు.