Home Page SliderNational

ఆర్బీఐ భవనాన్ని పేల్చేస్తాం..

ముంబైలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ – మెయిల్ పంపారు. ఆర్బీఐ భవనాన్ని పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో కార్యాలయానికి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆర్బీఐ కార్యాలయం చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బాంబు బెదిరింపునకు సంబంధించి ముంబై పోలీసులు మాతా రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేశారు. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.