home page sliderHome Page SliderTelangana

విమానాన్ని పేల్చేస్తాం…

భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ బెదిరింపు కాల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కలకలం సృష్టించింది. కోల్ కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ విషయాన్ని ఏటీసీకి తెలిపారు. శంషాబాద్ కు చేరుకున్న విమానాన్ని భద్రతా సిబ్బంది ఐసోలేషన్ కు తరలించారు. నాలుగు గంటల పాటు తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ఎవరు చేశారనే విషయం తేల్చే పనిలో పడ్డారు.