Andhra PradeshHome Page Slider

గేం ఛేంజర్ తో మోసపోయాం..

రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రా న్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. అయితే.. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టు లు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కా రు. గేమ్ ఛేంజర్ మూవీ టీం తమను మోసం చేసిందని గుంటూరు పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి 350 మంది వెళ్లామని, కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. తమను మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.