ఆపరేషన్ సింధూర్ ను స్వాగతిస్తున్నాం..
పాకిస్తాన్ కు మరింత గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఆయన స్వాగతించారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అన్ని మౌళిక సదుపాయాలను సమూలంగా నిర్మూలించాలన్నారు. పాక్ లో టెర్రర్ క్యాంపులపై మన రక్షణ దళాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నాను. పహల్గాం ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. పాక్ ఉగ్రవాద ఇన్ఫ్ స్ర్టక్చర్ ను పూర్తిగా నాశనం చేయాలని ఆయన పేర్కొన్నారు. తర్వాత జైహింద్ అంటూ ఉర్దూ, హిందీలో సోషల్ మీడియా పోస్టు చేశారు.

