కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతానంటే పార్టీ స్వాగతిస్తుందని పార్టీ మీడియా సెల్ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సొంత పార్టీ, కన్న తండ్రి, తోడబుట్టిన వాళ్లు, కుటుంబంపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోందన్నారు. తనను జైల్లో పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని గతంలోనే కవిత చెప్పారని సామా గుర్తు చేశారు. తనను జైలులో పెట్టించిన బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం జీర్ణించుకోలేక బాహాటంగానే కవిత తన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.