భారత్‌తో బలమైన రాజకీయ సంబంధాలు కోరుకుంటున్నాం-పుతిన్
భారత్ అతి వేగంగా అభివృద్ధిని సాధిస్తోందని, తమ దేశం భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో భారత్ గొప్ప ఆర్థిక పురోగతి సాధిస్తోందని కొనియాడారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ భారత్‌ను పొడగ్తలతో ముంచెత్తారు. ఆర్థిక భద్రత, సైబర్ క్రైమ్ వంటి అంశాలలో భారత్ సహకారం తమకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో సత్సంబంధాలు రష్యాకు ఉండాలని కోరుకున్నారు. వర్థమాన దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించడంతో పుతిన్ ఈ రకంగా భారత్‌ను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

