మేము సైతం ..పారాలింపిక్స్‌లో భారత్ పురుషుల ఖాతాలో రజతం
మహిళలే కాదు మేము సైతం పతకాలు సాధిస్తామని భారత పురుష అథ్లెట్లు కూడా పారాలింపిక్స్‌లో బోణి కొట్టారు. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టోల్‌లో ఎస్‌హెచ్ -1 షూటింగ్ విభాగంలో మనీశ్ నర్వాల్ రజత పతకం సాధించారు. మహిళలకు 3 పతకాలు, పురుషులకు 1 పతకంతో భారత్ ఖాతాలో 4పతకాలు చేరాయి. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యం ఉన్నాయి. అవనీ లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకం, మోనా ఆగర్వాల్ ఇదే ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. మహిళల పరుగుపందెంలో 100 మీటర్లు, టీ 35 విభాగంలో ప్రీతి పాల్ ఫైనల్‌లో కాంస్య పతకం గెలిచింది.