‘అవనిని చూసి ఎంతో నేర్చుకోవాలి’..మనుబాకర్
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణపతకం సాధించి పెట్టిన షూటర్ అవనీ లేఖర్‌ను మనుబాకర్ ప్రశంసలతో ముంచెత్తారు. అవని ప్రస్థానం అందరికీ స్పూర్తి దాయకం అని, ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఆమె అందరికీ ఆదర్శమని, సవాళ్లను అధిగమించి దేశానికి పతకాలు తెస్తున్న పారాలింపియన్స్ ఎంతో గొప్పవారని ప్రశంసించారు. అవనికి, ఇతర పతక విజేతలకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. వారిని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. గత టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవని రెండు పతకాలు సాధించడం విశేషం. ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి మనుబాకర్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే..