Andhra PradeshHome Page Slider

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మానుకోవాలి: ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం టీడీపీ నాయకులు,కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. కాగా సీఎం మాట్లాడుతూ..తల్లిదండ్రులు,భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలన్నారు. అలా కాకుండా నాయకుల కాళ్లకు దండం పెట్టడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను కూడా వాళ్ల కాళ్లకు నమస్కరిస్తానన్నారు. కాగా నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సీఎం సూచించారు. ఈ మేరకు ఈ రోజు నుంచే ఈ విధానానికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.