బీజేపీ, కాంగ్రెస్‌ల సహాయం కావాలి – వైయస్ షర్మిల
తెలంగాణాలోని నిరుద్యోగ సమస్యపై కలిసికట్టుగా పోరాడదామంటూ బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు ఫోన్లు చేసింది వైయస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ‘కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావల్సిందేనని’ ఆమె కోరారు. ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపు నిద్దామని, అన్ని పార్టీలు తనకు సహకరించమని కోరింది. విడివిడిగా ఎంత అరచినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కలిసి పోరాటం చేయకపోతే ఇక్కడ బతకడం కష్టమని అన్నారు. షర్మిల విజ్ఞప్తిని బండి సంజయ్ స్వాగతించారు. నిరుద్యోగుల విషయంలో పోరాటానికి ఎంతకైనా తెగిస్తామని, ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్ధతు ఇస్తామన్నారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. పార్టీ వ్యక్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాల్సిందేనని పేర్కొన్నారు.