Home Page SliderTelangana

ఎన్నికల్లో మంచి ఫలితాలను ఆశిస్తున్నాం-జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలను ఆశిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మరింత అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. బీజేపీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రజలకు అభినందనలు తెలియజేశారు.