Andhra PradeshHome Page SliderNews Alert

ఐక్యమత్యంగా, క్రియాశీలకంగా పని చేయాలి…

2019 సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా పేదల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే పరమావధి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐకమత్యంగా అండగా నిలవాలని రాజ్య సభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కోరారు..బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యులుతో పాటు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి మరియు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు..

ఈ సందర్భంగా శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ..కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకుల త్యాగాలు ఫలితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిందని తెలిపారు.. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో కరోనా వంటి విపత్తు సంక్షోభాలను సైతం ఎదుర్కొని..దేశానికే ఒక రోల్ మోడల్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన అందిస్తోందని తెలిపారు.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా నవరత్నాల పథకాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా  ప్రజల ఇంటి వద్దకే చేరువ చేయటం జరిగిందన్నారు.. మిగిలిన ఒకటిన్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి అండగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఐక్యమత్యంగా, క్రియాశీలకంగా పని చేయాలని కోరారు..పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు..పార్టీ శ్రేణులు, కార్యకర్తల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని, వాటి అన్నిటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని చెప్పారు..రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన విధంగా 175 కి 175 సీట్లు సాధించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.