ఏపీలో బియ్యం,కందిపప్పు ధరలు తగ్గించాం: మంత్రి నాదెండ్ల
ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాగా రాష్ట్రంలో బియ్యం, కందిపప్పు ధరలను తగ్గిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు రైతు బజార్ ప్రత్యేక కౌంటర్‌లో కందిపప్పు కేజీ రూ.150,బియ్యం కేజీ రూ.47,స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గించామని ఆయన పేర్కొన్నారు. అయితే రేపటి నుంచే తగ్గిన ధరలతో రైతుబజార్‌లో వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించామన్నారు. కాగా కూటమి అధికారంలోకి వచ్చాక నెల వ్యవధిలోనే రెండుసార్లు ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి నాదెండ్ల ట్వీట్ చేశారు.