‘మాకేం సంబంధం లేదు’..అమెరికా
భారత్- పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త ఘర్షణల విషయంలో అమెరికా స్పందించింది. గురువారం రాత్రి భారత్ పాక్ సరిహద్దుల్లో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ నుండి వచ్చిన దాదాపు 50 డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. దీనితో అమెరికా సెక్రటరీ అప్పుడే పాక్ ప్రధానితో మాట్లాడారు. ఆయుధ చర్యలకు పాల్పడవద్దని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సర్దిచెప్పారు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ రెండు అణుశక్తి ఉన్న దేశాలు ఘర్షణ పడుతూ సంక్షోభానికి గురి కావడంపై ఆందోళన చెందుతున్నామని, కానీ యుద్ధంలో అమెరికా తలదూర్చదని, మాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

