కాలుష్య సమస్య రాకూడదనే హిల్ట్ పాలసీ తెచ్చాం
ఢిల్లీలో ఉన్న విధంగా హైదరాబాద్‌కు కాలుష్య సమస్య రాకూడదనేనని సీఎం ఆయన తెలిపారు. ఈ హిల్ట్ పాలసీ ఒక గొప్ప నిర్ణయమని కొనియాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధరలు వస్తాయని చెప్పారు. హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం కౌంటర్ ఇచ్చారు . నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని విమర్శించారు. పరిశ్రమలు హైదరాబాద్ నడిబొడ్డున ఉండటం వల్ల కాలుష్యం పెరుగుతోందని, అందుకే వాటిని ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించి, వాటి స్థానంలో రెసిడెన్షియల్ ఏరియా చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు చేశారు . గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్‌ను దోచుకుంటుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అలాగే, ముఖ్యమంత్రి ఒక సామెతలా మాట్లాడిన వ్యాఖ్యల్ని పట్టుకుని బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, కులం, మతం లేకుండా బీజేపీ వాళ్లకు పూట గడవదని విమర్శించారు. చివరగా, డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

