4 ఏళ్ల పాలనలో 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం:ఏపీ మంత్రి రజిని
నేటితో ఏపీలో జగన్ పాలనకు 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని పలువురు వైసీపీ నేతలు ప్రజలకు తెలియజేశారు. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కూడా ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. YCP 4 ఏళ్ల పాలనలో వైద్యరంగంలో విశేషమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఏపీలో అమలు చేసిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారాయని తెలిపారు. వైద్యశాఖలో ఇప్పటివరకు 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి రజిని వెల్లడించారు. అంతేకాకుండా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటింటికి వైద్యం అందిస్తున్నామని ఆమె వివరించారు. ఏపీ ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. జగనన్న పాలనలో ఏపీలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు.

