Home Page SliderInternational

“ప్రపంచ విజేతలుగా నిలిచాం .. కెప్టెన్ మీరు సాధించారు”:బీసీసీఐ

టీమిండియాతోపాటు ఎన్నో కోట్లమంది భారతీయుల కల 13 ఏళ్ల తర్వాత నెరవేరింది. కాగా T2O వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సౌతాకాఫ్రికాపై విజయం సాధించి పొట్టి కప్పును ఒడిసి పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ దీనిపై మిషన్ పూర్తి అయ్యింది అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. “కోట్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు , కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్ మీరు సాధించారు” అంటూ T20 వరల్డ్ కప్‌తో రోహిత్ దిగిన ఫోటోలను బీసీసీఐ పంచుకుంది.