మీలా మేము పదవులు అడుక్కోలేదు..
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతుండటంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. “వారికి పూర్తి మెజార్టీ వచ్చినా ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఫలితాలు వచ్చి 7 రోజులైనా సీఎం ఎవరనేది చెప్పట్లేదు. తమ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని, అమిత్ షా ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు. శివసేన పేరు పెట్టుకుని ఏక్ నాథ్ శిండే రాజకీయాలు చేశారు. కానీ, ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోలేక ఢిల్లీ వెళ్లారు. మా హయాంలో బాలాసాహెబ్ ఠాక్రే భవిష్యత్తును ఎన్నడూ దిల్లీలో తాకట్టు పెట్టలేదు. ముంబయిలోనే ఉన్నాం. కానీ, ఇప్పుడు వారు ఢిల్లీ వెళ్లి పదవుల కోసం అడుక్కుంటున్నారు” అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.