Andhra PradeshHome Page Slider

దళితులపై వైసీపీ  కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నాం: చంద్రబాబు

కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. దళితుడైన వీరాంజనేయ స్వామి గొంతు నొక్కేందుకు వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. స్వామిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌లు,వేధింపులకు టీడీపీ పార్టీ నాయకులు ఎప్పుడు భయపడరు అన్నారు. ఏపీ పోలీసులు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..చంద్రబాబు ఓ వీడియోను పోస్ట్ చేశారు.