‘ఆయనను ఆదర్శంగా తీసుకునే ఈ దాడులు చేశాం’… రాజ్‌నాథ్ సింగ్
పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఆర్మీ గట్టి సమాధానం చెప్పిందన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రామాయణంలోని హనుమంతుడినే ఈ దాడులకు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లామన్నారు. నాడు సీతమ్మను రావణుడు అపహరించినందుకు హనుమంతుడు లంకాదహనం చేసినట్లు, మన భారత ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేసిన టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ మొదలయ్యిందన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలను చంపినవారినే చంపామని, తమ లక్ష్యం పాక్ ప్రజలు, సైనికులు కాదని స్పష్టం చేశారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని, సరిహద్దు రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నామని హెచ్చరించారు.