అతిగా ప్రవర్తిస్తున్న వారి పేర్లు డైరీలో రాస్తున్నాం..
తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశామని, అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులు పేర్లు డైరీలో రాస్తున్నామని మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో హరీశ్ రావు మాట్లాడుతూ.. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. రైతులను మోసం చేసిన నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని సీఎంపై ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చే వరకు సీఎంను తాను అలాగే పిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెడుతున్నారని మండిపడ్డారు.