ఓటమికి కారణం మేమే : కోహ్లీ
ఈ IPL సీజన్‌లో భారీ అంచనాలతో రంగంలోకి దిగిన కొన్ని జట్టులు తమ పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. కాగా IPL ప్రారంభమైనప్పటి నుంచి RCB జట్టు ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబురుస్తు వస్తోంది. దీంతో RCB జట్టు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం అత్యంత పేలవమైన ప్రదర్శన ఇస్తోంది. దీంతో వరుస పరాజయాలు తమ ఖాతాలో వేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన RCB Vs KKR మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతోRCBపై KKR గెలుపొందింది. ఈ ఓటమిపై RCB స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. దీనిపై ఆయన ఆసక్తికర వాఖ్యలు చేశారు. కాగా ఈ ఓటమికి తాము పూర్తిగా అర్హులమని కోహ్లీ తెలిపారు. ఆటను ఫ్రొఫెషనల్‌గా ఆడలేకపోయామన్నారు. మా జట్టు సభ్యులు బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన..ఫీల్డింగ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచారన్నారు. కాగా ఫీల్డింగ్‌లో సులువైన క్యాచ్‌లను సైతం చేజార్చుకొని ఓడిపోయామన్నారు. నిజాయితీగా చెప్పాలంటే తామే కేకేఆర్‌కు మ్యాచ్ అప్పగించామన్నారు. అంతేకాకుండా సొంత గడ్డపై ఓడిపోవడం మమ్మల్ని తీవ్రంగా నిరాశ పరుస్తుందన్నారు. అయితే ఇకపై బయట జరిగే మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉందని కోహ్లీ వెల్లడించారు.

