Home Page Sliderhome page sliderTelangana

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాం..

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో హైదరాబాద్ నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్ నగర్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. అంతర్గత భద్రత అంశంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.