Home Page SliderTelangana

అభ్యర్థులను ప్రకటించడంలో మేము వెనుకబడలేదు: భట్టి విక్రమార్క

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. దీనిపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. కాగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులను ప్రకటించడంలో మేము వెనుక బడలేదన్నారు. అయితే పార్టీ వీడుతారనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ముందే అభ్యర్థులను ప్రకటించిందని భట్టి వెల్లడించారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన హమీలకే దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షలతో పొత్తులపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని భట్టి వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని భట్టి అన్నారు.కాగా  తెలంగాణాలో పొంగులేటి,తుమ్మల పోటీ చేసే స్థానాలతో పాటు..మిగతా స్థానాలపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. స్ర్కీనింగ్ కమిటీ ,సీఈసీలో చర్చించి..అభ్యర్థులను ప్రకటిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.