Home Page SliderTelangana

మూసీలో అక్రమ కట్టడాలపై BRS తీసుకున్న నిర్ణయాలే పాటిస్తున్నాం.. మంత్రి శ్రీధర్ బాబు

మూసీలో అక్రమకట్టడాలపై తమ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలేం లేవని, BRS వారు ఏర్పాటు చేసిన పద్దతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నిజానికి వారి ఆలోచన బాగుంది. అందుకే దీనికి సంబంధించిన జీవో తెచ్చారు. వారి జీవోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. మరి వారి నిర్ణయాలను ఎలా మరిచిపోయారు. అప్పట్లో ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కదా. అప్పట్లోనే వారు బౌండరీలు నిర్థారించారు. అప్పుడే కేటీఆర్ ఎన్నోసార్లు సమీక్ష చేశారు. విశ్వసుందర నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే మా ప్రభుత్వం కూడా పని చేస్తోంది. ఇప్పుడు బీఆర్‌ఎస్ వాళ్లు రాజకీయం చేస్తున్నారు. మూసీపై కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు ఇప్పటికే చర్లపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించామని, వారు తరలివెళ్లడానికి వాహనాలు కూడా ఏర్పాటుచేశామన్నారు.