‘నీటిఎద్దడితో చచ్చిపోతున్నాం..నీళ్లివ్వండి’..పాక్ మొసలికన్నీరు
పాకిస్తాన్ తీవ్ర నీటిఎద్దడితో సతమతమవుతోందని, సింధూ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష చేయాలంటూ పాకిస్తాన్ మొసలికన్నీరు కారుస్తూ భారత జలవనరుల మంత్రిత్వ శాఖకు అధికారిక లేఖ రాసింది. పహల్గాం ఉగ్రదాడి ప్రభావంతో భారత్ సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేసింది. దీనితో పాక్‌లోని ఖరీఫ్ పంటపై దీని ప్రభావం పడింది. కాల్పుల విరమణను పాటించినా పాక్‌పై భారత్ విధించిన ఆంక్షలు అమలవుతాయని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని పాక్‌కు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా గతంలోనే తెలియజేశారు. సింధూ జలాలను పాకిస్తాన్‌కు వదలడానికి వీల్లేదంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.