మరో దారి లేక చనిపోతున్నాం.. క్షమించండి..
హైదరాబాద్-హబ్సిగూడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఓయూ పీఎస్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి.. ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు . గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక అవస్థలు పడ్డారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు.. కెరీర్, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వేరే మార్గం లేక చనిపోతున్నాం.. క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి(9వ తరగతి), కుమారుడు విశ్వన్ రెడ్డి(5వ తరగతి). విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.