Home Page SliderInternational

హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్నాం, సపోర్ట్ చేయండి లేదంటే మీ కర్మ

పశ్చిమాసియాలో యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయెల్ సరిహద్దు దేశాల్లోని హిజ్బుల్లా కమాండోలను అంతమొందించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు, ఇళ్లలో నక్కినవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రజలతో యుద్ధం చేయడం లేదని, కేవలం ఇళ్లలో క్షిపణులను ఉంచుతున్న హిజ్బుల్లా దళాలతో పోరాడుతున్నామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ పౌరుల భద్రత కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఆయుధాలను బయటకు తీస్తామని శబధం చేశారు. “లెబనాన్ ప్రజలకు నా దగ్గర ఒక సందేశం ఉంది. ఇజ్రాయెల్ యుద్ధం మీతో కాదు, హిజ్బుల్లాతో. చాలా కాలంగా, హిజ్బుల్లా దళాలు అయామయక లెబనా ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నాయి. అది మీ ఇళ్లలో రాకెట్లను, గ్యారేజీలలో క్షిపణులను ఉంచి యుద్ధం చేస్తోంది. ఆ రాకెట్లు, క్షిపణులు నేరుగా నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. హిజ్బుల్లా దాడులకు వ్యతిరేకంగా ప్రజలను రక్షించడానికి, మేము ఆ ఆయుధాలను బయటకు తీయాలి, ”అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అన్నారు.

“హిజ్బుల్లా కోసం మీ జీవితాలను, మీ ప్రియమైనవారి ప్రాణాలను ప్రమాదంలో పడనివ్వవద్దు. ఇప్పుడే ప్రమాదం నుండి బయటపడండి. మా ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మీరు సురక్షితంగా మీ ఇళ్లకు తిరిగి రావచ్చు.” అని నెతన్యాహు అన్నారు. లెబనాన్‌ను నడుపుతున్న హిజ్బుల్లా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనా గ్రూప్ హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌తో కాల్పులు జరుపుతోంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి వరకు 492 మంది మరణించినట్లు అంచనా వేసింది. వీరిలో 35 మంది చిన్నారులు, 58 మంది మహిళలు ఉన్నారు. కనీసం 1,645 మంది గాయపడ్డారని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు. లెబనాన్ అంతటా పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో రచ్చ చేస్తోంది. ఈ మొత్తం దీనిని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ను నిందించింది. గత వారం జరిగిన ఆ పేలుళ్లలో కనీసం 39 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు.