NewsTelangana

మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మంగళవారం నారాయణపురంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వమన్నారు. రైతు బంధు కావాలా? రాబందు కావాలా? ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్‌ కోరారు. 14 నెలల్లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలన్నారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు.