అందరం కలిసి పనిచేస్తాం-చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండాపోయిందన్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతలు కలిసిరావాలన్నారు. రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజలే నిర్ణయించుకుంటారన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తోందని చెప్పలేకపోతే ఎలా అని ప్రశ్నించారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలను తిట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.. ఆ ఆనందం శాశ్వతం కాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతామన్నారు. అందరు కలిసి.. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కర్తవ్యమన్నారు. కొందరు పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బయటకు వస్తే ప్రతిపక్ష నేతలపై నిర్బంధాలా అంటూ ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసిన పోలీసులను కంట్రోల్ చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు ఆలోచించాలన్నారు. తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు.