చలి కాలంలోనే మొదలైన నీటి కష్టాలు..
హైదరాబాద్ లో ఈ సారి ఎండాకాలం రాక ముందే చలి కాలంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే నీటి కష్టాల ప్రభావాన్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. నిజాంపేట్ బండారీ లేఅవుట్ తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. నిత్యం నీటి అవసరాలు తీర్చుకునేందుకు స్థానికులు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. చలికాలంలో ఈ పరిస్థితి ఉంటే వచ్చే ఎండాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు.