వర్రాకు మరో 14 రోజుల రిమాండ్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైనా వర్రా రవీంద్రరెడ్డి రిమాండ్ ను కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్ 9 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ వర్రాను కడప కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అతడిపై పెట్టిన కేసులో కడప, భీమవరం, నెల్లూరుకు చెందిన నలుగురిని కూడా పోలీసులు విచారించనున్నారు.