Home Page SliderInternational

వార్నర్ ఆస్ట్రేలియా ఇంపాక్ట్ ప్లేయర్:కోహ్లీ

ఈ రోజు నుంచి ఇండియా vs ఆస్ట్రేలియా WTC ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ ప్రత్యర్థి టీమ్‌ను ఉద్దేశిస్తూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని విరాట్ కోహ్లీ తెలిపారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా టీమ్‌కు వార్నర్ ఇంపాక్ట్ ప్లేయర్ అన్నారు. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగానే మన నుంచి ఆటను లాగేసుకుంటాడన్నారు. అది ప్రత్యర్థులను ఎప్పుడు బాధపెడుతుందన్నారు. కాగా అతన్ని తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుందన్నారు.మొత్తానికి వార్నర్ చాలా డేంజరస్ ప్లేయర్ అని విరాట్ స్పష్టం చేశారు. అయితే అతడు ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు అని విరాట్ వార్నర్‌ను ప్రశంసించారు. ఇవాళ నుంచి ఈ నెల 11 వరకు జరగబోయే ఈ WTC ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఛాంపియన్స్‌గా నిలుస్తారో చూడాలని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.