Home Page SliderNational

త్రాగునీరు కోసం కిలోమీటర్ల కొద్దీ నడక

మహారాష్ట్రలోని చాలా గ్రామాలు నీటిఎద్దడికి లోనవుతున్నాయి. త్రాగునీటి కోసం గిరిజనులు కనీసం రెండు కిలోమీటర్ల నుండి ఐదు కిలోమీటర్ల వరకూ కాలినడకన వెళ్లి తెచ్చుకుంటున్నారు. నాసిక్ జిల్లాలోని గిరిజన ప్రాంతమైన బోర్ధపదా గ్రామంలో నీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు గిరిజనులు. గ్రామంలోని బావులు, చెరువులు ఎండిపోయాయి. దీనితో కొండ దిగువన ఉన్న బావినుండి నీటిని తెచ్చుకుంటున్నారు.

ఈ దారంతా కొండప్రాంతం కావడంతో తాము గాయాలపాలవుతున్నామని బాధ పడుతున్నారు మహిళలు. ప్రభుత్వాలు తమకు నీటి ట్యాంకర్లు తెప్పించాలని కోరుతున్నారు. దేశంలో ఒకపక్క హిమపాతాలు, తుఫాన్లు, వర్షాలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుంటే కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడితో బాధ పడుతున్నాయి.