బర్త్ సర్టిఫికేట్ కోసం లంచం తీసుకుంటూ ‘ఏసీబీ’కి దొరికిన వీఆర్‌వో
బర్త్ సర్టిఫికేట్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయారు నువ్వూరుపాడు గ్రామ VRO M.మాల్యాద్రి. బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికెట్ వరకూ ప్రభుత్వ అధికారుల నుండి ఏం కావాలన్నా లంచం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా నువ్వూరుపాడులో జరిగింది. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే 15,000 వేల రూపాయల లంచం ఇవ్వాలని VRO M. మాల్యాద్రి డిమాండ్ చేశారు. దీనితో వెంకటేశ్వర్లు Nellore, ACB అధికారులను సంప్రదించి, అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివ్వాలనుకున్నారు. ఈ రోజు పట్టణంలోని Canara బ్యాంకు సమీపంలో 10 వేలు VRO కి ఇస్తూ వుండగా ACB, DSP, Nellore మోహన్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయరెడ్డి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.