వరద బాధితుడిపై వీఆర్వో దాడి..
వరద బాధితుడిపై వీఆర్వో విజయలక్ష్మి దాడి చేసింది. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ షాదిఖానా రోడ్డులో ఉన్న వ్యక్తి చెంపపై చెళ్లుమనిపించింది వీఆర్వో. ప్రభుత్వం చెప్పినా సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదంటూ వరద బాధితుడు నిరసన తెలిపాడు. త్రాగడానికి నీరు, ఆహారం ఇవ్వడంలేదంటూ .. వీఆర్వో, వరద బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తురాలై వీఆర్వో విజయలక్ష్మి వరద బాధితుడి చెంపపై కొట్టింది. వీఆర్వో విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

