ప్రజాభవన్ వద్ద వీఆర్ఎల నిరసన
జీవో 81 ప్రకారం వారస్వత ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ ప్రజాభవన్ వద్ద వీఆర్ఎలు నిరసన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సీసీఎలకు తిరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కలిసి సమస్యను వివరించారు. సీఎం, మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

