ఓటర్లే బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీనే పోరాడిందని తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలానికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబానికి సమాధానం చెప్పేది తాను కాదని, రాష్ట్ర ప్రజలే తమ ఓట్లతో ఓడిస్తారని హెచ్చరించారు. గజ్వేల్‌లో ఈటల నామినేషన్ ర్యాలీలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.