Andhra PradeshHome Page Slider

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఓ క్యాన్సర్ గడ్డ లాంటిది: ఎంపీ రఘురామ

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విశాఖలో ఓ వాలంటీర్ బంగారం కోసం వరలక్ష్మి అనే మహిళను హత్య చేశాడు. కాగా ఈ ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ఈ హత్యకు సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలంతా   బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఎలాంటి బాధ్యత లేనివారిని ఊరు మీదకు వదిలితే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన విమర్శించారు. కాగా విశాఖలో జరిగిన వరలక్ష్మి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ఓ క్యాన్సర్ గడ్డలా సీఎం జగన్ ప్రవేశ పెట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.