“పవన్‌కు పోటీగా వాలంటీర్ చాలు”: జోగి రమేష్
ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కాగా దీనిపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో వాలంటీర్ వ్యవస్థ విజయవంతం కావడం వల్లే పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో తిరిగడానికే అర్హతే లేదన్నారు. అసలు పక్క రాష్ట్రంలో నివసించే పవన్‌కు ఏపీతో సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాగా పవన్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్‌ను నిలబెట్టి గెలిపించి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. జనసేనాకి దమ్ముంటే పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్‌కి ఛాలెంజ్ చేశారు.

