వైజాగ్ స్టీల్ మరో ఘనత
వైజాగ్ స్టీల్ ఉత్పత్తిలో మరో ఘనత సాధించింది. మొత్తం ఉక్కు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరింది. ఈ పరిశ్రమలో 1990 నవంబరులో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అప్పటి నుండి ఇప్పటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసి రికార్డు సాధించింది. అయితే ఈ ఏడాదిలో విశాఖ ఉక్కుకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రైవేటీకరణ భయం కూడా వెంటాడుతోంది. దానికి తోడు ముడి సరుకు కొరత వల్ల 2,3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది యాజమాన్యం. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వం కూడా సహకరించాలని వారు కోరుతున్నారు.