Andhra PradeshHome Page Slider

వివేక హత్య కేసు: చంద్రబాబు గేమ్‌లో సునీత, షర్మిల పావులు-అవినాష్ రెడ్డి

Share with

వివేక హత్యతో తనకు సంబంధం లేదన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. విచారణ సంస్థలు తమను టార్గెట్ చేసుకుని విచారించాయని గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు అవినాష్ రెడ్డి. వాచ్ మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా నలుగురు పేర్లు చెప్తే, నెల రోజులు పాటు ప్రత్యక్షసాక్షి చెప్పినవారిని అరెస్టు చేయలేదని, కనీసం విచారించలేదన్నారు. సునీత తనపై బురుదజల్లుతోందని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారన్నారు అవినాష్. దస్తగిరి బెయిల్ విషయంలో సునీత అడ్డు చెప్పలేదని, తమను మాత్రం జైలుకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. సునీత, దస్తగిరి చీకటి ఒప్పందం చేసుకున్నారని, కేసు విషయంలో లాలూచీపడ్డారన్నారు. వివేకను తనే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. సీబీఐ మొత్తం కేసులో సరిగా వ్యవహరించలేదన్నారు. సునీతతో ఒప్పందం మేరకే దస్తగిరి అప్రూవర్‌గా మారాడన్నారు. దస్తగిరి బెయిల్ కు సునీత అడ్డు చెప్పలేదన్నారు.

నాడు సీబీఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన సునీత, తన వద్ద లెటర్ గురించి తెలియదని తప్పించుకుందన్నారు. హత్య గురించి తనకు అంతా తెలుసని నేరం మోపుతున్నారని, ఇది దారుణమన్నారు అవినాష్. శివప్రకాష్ రెడ్డి మూడో పర్సన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసు విచారణ అంతా లాలూచీ మేరకు జరుగుతుందని, కావాలనే తనపై నిందలు మోపుతున్నారన్నారు. సీబీఐ విచారణ సందర్భంగా, సునీత అసలు లెటర్ విషయాన్ని ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. ఎర్రగంగిరెడ్డికి… నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేశాడని.. వాళ్లు ఫోన్ చేస్తేనే ఎర్ర గంగిరెడ్డి వచ్చాడన్నారు. వైఎస్ వివేకను సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేరని, చివరి రోజుల్లో దారుణంగా చూశారన్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేకౌట్ రెండూ ఒకటే అని చెప్తున్నారని, ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్న అవినాష్ రెడ్డి, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని.. కేసులో అనవసరంగా తన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారన్నారు.